అంకితం ప్రభూ నా జీవితం
ankitam prabhoo naa jeevitam
ఆ..ఆ..ఆ..ఆ..ఆ.. అంకితం ప్రభూ నా జీవితం నీ చరణాల సేవకే అంకితమయ్యా..(2) నీ సేవ కై ఈ సమర్పణ అంగీకరించుము నాదు రక్షకా (2) అంకితం ప్రభూ నా జీవితం నీ చరణాల సేవకే అంకితమయ్యా.. (2)
మోడుబారిన నా జీవితమును చిగురింపజేసావు దేవా... నిష్ఫలమైన నా జీవితమును ఫలియింప జేసావు ప్రభువా ... నీ కృపలో బహుగా ఫలించుటకు ఫలింపని వారికి ప్రకటించుటకు … నీ కృపలో బహుగా ఫలించుటకు ఫలింపని వారికి ప్రకటించుటకు అంగీకరించుము నా సమర్పణ అంకితం ప్రభూ నా జీవితం నీ చరణాల సేవకే అంకితమయ్యా..
కారు చీకటి కాఠిన్య కడలిలో నీ కాంతినిచ్చావు దేవా చీకటిలోనున్న నా జీవితమును చిరుదివ్వేగ చేశావు ప్రభువా నీ సన్నిధిలో ప్రకాశించుటకు అంధకార చాయలను తొలగించుటకు నీ సన్నిధిలో ప్రకాశించుటకు అంధకార చాయలను తొలగించుటకు.. అంగీకరించుము నా సమర్పణ
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.
