♪♫
TG-1300
Telugu
అనుభవానికి వచ్చెనా అంతులేని వేదన
anubhavaaniki vachchenaa anthuleeni veedana
205
views
పల్లవి
అనుభవానికి వచ్చెనా అంతులేని వేదన దైవవాక్కును మీరినందుకు పడెను నీకు కఠిన శిక్ష
1వ చరణం
మట్టినుండి మనిషిగా ప్రభు నిన్ను మలిపినాడే ప్రక్కటెముకల పడతి చేసి నీకు తోడుగ పంపినాడే భువిని స్వర్గము చేసి మంచి చెడులను తెలిపినాడే ||అనుభవానికి||
2వ చరణం
రాజు నీవు రాలిపడితివి రాయి రప్పల మధ్యన కలికి మాటకు విలువ ఫలముగ కష్టములు నిన్ను ముసిరెనా ఆదరించిన ప్రకృతే నిను వికృతముగా మార్చెనా ||అనుభవానికి||
3వ చరణం
మనిషి మనుగడ విలువ ఫలముగ జన్మ పాపము అంటగట్టి ఆరు ఋతువుల కాల చక్రం పాపభారము తలన పెట్టి తరతరాలుగా జాతిని మరణ భయమున త్రోసినావే ||అనుభవానికి||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.