TG-3139
Telugu

అనుదినం ఆ ప్రభుని

Anudinam Aa Prabhuni

12
views
పల్లవి

అనుదినం ఆ ప్రభుని వరమే అనుక్షణం ఆశ్చర్య కార్యమే ఆనందం-తో స్వీకరించుము అబ్బురం-తో ఆనందించుము పచ్చిక గల చోట్ల నన్ను పరుండజేసిన దేవుడు (2) నూనెతో నా తలను అంటి దీవెనలతో నింపును ||అనుదినం||

1వ చరణం

అనుదినం ఆ ప్రభుని వరమే అనుక్షణం ఆశ్చర్య కార్యమే ఆనందం-తో స్వీకరించుము అబ్బురం-తో ఆనందించుము తల్లియైనా మరచునేమో మరువడు ప్రభు ఎన్నడూ (2) ముదిమి వచ్ఛు వరకు నన్ను ఎత్తుకొని కాపాడును ||అనుదినం||

2వ చరణం

అనుదినం ఆ ప్రభుని వరమే అనుక్షణం ఆశ్చర్య కార్యమే ఆనందం-తో స్వీకరించుము అబ్బురం-తో ఆనందించుము నాదు పాపపు భారమెల్ల మోసెను నా దేవుడు (2) సిలువపై మరణించి నాకు రక్షణిచ్చెను యేసుడు ||అనుదినం||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.