అన్యజనులేల లేచి గల్లత్తు చేయు-చున్నారు

anyajanuleela leechi gallaththu cheeyu-chunnaaru

🎵 TG-1597🌐 Telugu
పల్లవి

అన్యజనులేల లేచి గల్లత్తు చేయు-చున్నారు – అన్యజనులేల జనములేల వ్యర్థమైన దాని తలంచుచున్నవి (2)           ||అన్యజనులేల||

1వ చరణం

భూలోక రాజులు లేచి వారేకముగా ఆలోచించి – భూలోక రాజులు వారి పాశములను తెంపి పారవేయుద మనుచున్నారు ఆకాశ వాసుండు వారిని అపహసించుచున్నాడు నవ్వి – ఆకాశ వాసుండు వారలతో పల్కి కోపముతో వారిని తల్లడిల్ల చేయును పరిశుద్ధమైన నాదు పర్వతమగు సీయోను మీద – పరిశుద్ధమైన నారాజు నాసీనునిగా జేసి యున్నానని సెలవిచ్చెను కట్టడ వివరింతు నాకు యిట్లు చెప్పెను యెహోవాయందు – కట్టడ వివరింతు నీవు నా కుమారుడవు నిన్ను నేను కనియున్నాను నన్ను అడుగుము నీకు జనముల భూమిని స్వాస్థ్యముగా – నన్ను అడుగుము దిగంతముల వరకు స్వాస్థ్యముగా నొసంగెదను నీకు ఇనుప దండముతో నీవు వారిని నలుగగొట్టెదవు – ఇనుప దండముతో కుండను పగులగొట్టునట్లు వారిని పగులగొట్టెదవు ఓ రాజులారా మీరు జ్ఞానవంతులై యుండుడి – ఓ రాజులారా ఓ భూపతులారా మీరు నాభోద నొందుడి నేడే

Report Error