TG-4550
Telugu

అపాయం అంత్యకాలం చుట్టూరా అంధకారం

Apaayan Anthyakaalan Chuttooraa Andhakaaran

14
views
పల్లవి

అపాయం అంత్యకాలం చుట్టూరా అంధకారం వికారం భ్రష్ఠలోకం సమస్తం మోసకారం సువార్తే పరిష్కారం సువార్తే పరిష్కారం సువార్తే పరిష్కారం సువార్తే పరిష్కారం సువార్త సారం తెలిసుండీ నిస్సార సాక్ష్యం మనదేనా పరలోక వెలుగును కలిగుండీ మరుగైన దీపం మనమేనా ఇకనైనా లేవరా ఎలుగెత్తి సత్యాన్ని ప్రకటించరా ఇప్పుడైనా కదలరా లోకాన్ని ఎదిరించి పోరాడరా సువార్తే పరిష్కారం సువార్తే పరిష్కారం సువార్తే పరిష్కారం సువార్తే పరిష్కారం జాతివిద్వేషపు జాడ్యంలో మతోన్మాద విషమౌఢ్యంలో దేశం ఆరని జ్వాలాయె సంఘం హింసలపాలాయె ||ఇకనైనా లేవరా||

1వ చరణం

అబద్ద బోధల మోసాలు అణగారుతున్నవి సంఘాలు వేలకువేల కుటుంబాలు నశించిపోతున్నవి చూడు ||ఇకనైనా లేవరా||

2వ చరణం

జెండరు గందరగోళాలు లింగద్రవత్వపు ఘోరాలు సంధిగ్ధంలో నేటితరం సంక్షోభంలో మనిషితనం ||ఇకనైనా లేవరా||

3వ చరణం

బహుళ సవాళ్ళను ఎదురుకొని ఐక్యత బంధం నిలుపుకుని రేపటి తరాన్ని శిష్యులుగా నిలిపే బాధ్యత మనదేరా ||ఇకనైనా లేవరా||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.