అపరాధిని యేసయ్య కృప జూపి బ్రోవుమయ్యా నెపమెంచకయె నీ కృపలో నపరాధములను క్షమించు ||అపరాధిని||
సిలువకు నిను నే గొట్టితిని తులవలతో జేరితిని కలుషంబులను మోపితిని దోషుండనేను ప్రభువా ||అపరాధిని||
ప్రక్కలో బల్లెపుపోటు గ్రక్కున పొడిచితి నేనే మిక్కిలి బాధించితిని మక్కువ జూపితివయ్యో ||అపరాధిని||
ముళ్లతో కిరీటంబు నల్లి నీ శిరమున నిడితి నా వల్ల నేరమాయె చల్లని దయగల తండ్రీ ||అపరాధిని||
దాహంబు గొనగా చేదు చిరకను ద్రావనిడితి ద్రోహుండనై జేసితినీ దేహంబుగాయంబులను ||అపరాధిని||
ఘోరంబుగా దూరితిని నేరంబులను జేసితిని క్రూరుండనై గొట్టితిని ఘోరంపు పాపిని దేవా ||అపరాధిని||
చిందితి రక్తము నాకై పొందిన దెబ్బలచేత నిందలు పెట్టితినయ్యో సందేహమేలనయ్యా ||అపరాధిని||
శిక్షకు పాత్రుడనయ్యా రక్షణ దెచ్చితివయ్యా అక్షయ భాగ్యము నియ్య మోక్షంబు జూపితివయ్యా ||అపరాధిని||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.