అపరాదిని యేసయ్యా - కృప జూపి బ్రోవుమయ్యా
aparaadini yeesayyaa - krupa juupi broovumayyaa
అపరాదిని యేసయ్యా - కృప జూపి బ్రోవుమయ్యా నెపమెంచకయె నీ కృపలో - నపరాధములను క్షమించు
సిలువకు నిను నే గొట్టితిని - తులవలతో జేరితిని కలుషంభులను మోపితిని - దోషుండనేను ప్రభువా ||అపరాదిని యేసయ్యా||
ప్రక్కలో బల్లెపుపోటు - గ్రక్కున పొడిచితి నేనే మిక్కిలి బాధించితిని - మక్కువ జూపితివయ్యా ||అపరాదిని యేసయ్యా||
ముళ్ళతో కిరీటంబు - నల్లి నీ శిరమున నిడితి నా వల్ల నేరమాయె - చల్లని దయగల తండ్రీ ||అపరాదిని యేసయ్యా||
దాహంబు గొనగా చేదు - చిరకను ద్రావనిడితి ద్రోహుండనై జేసితినీ - దేహంబుగాయములను ||అపరాదిని యేసయ్యా||
గోరంబుగా దూరితిని -నేరంబులను జేసితిని క్రూరుండనై గొట్టితిని - ఘోరంపు పాపిని దేవా ||అపరాదిని యేసయ్యా||
చిందితి రక్తము నాకై - పొందిన దెబ్బలచేత నిందలు పెట్టితినయ్యో - సందేహమేలనయ్యా ||అపరాదిని యేసయ్యా||
శిక్షకు పాత్రుడనయ్యా - రక్షణ దెచ్చితివయ్యా అక్షయభాగ్యము నియ్యా - మోక్షంబు జూపితివయ్యా ||అపరాదిని యేసయ్యా||