♪♫
TG-3143
Telugu
అప్పగింపబడిన రాత్
Appagimpabadina Raathri
0
views
పల్లవి
అప్పగింపబడిన రాత్రి చెప్ప సాగే శిష్యులతో (2) చెప్పరాని దుఃఖముతో తప్పదు నాకీ మరణమనెను (2) ||అప్పగింప||
1వ చరణం
రొట్టె విరచి ప్రార్ధించి నిట్టూర్పు విడచి ఇది నా దేహం (2) పట్టుదలతో నేనొచ్చుఁ వరకు ఇట్టులనే భుజించుడనెను (2) ||అప్పగింప||
2వ చరణం
ద్రాక్షా రస గిన్నెను చాపి వీక్షించుడిదియే నా రక్తం (2) రక్షణార్థం దీని త్రాగి మోక్ష రాజ్యం చేరుడనెను (2) ||అప్పగింప||
3వ చరణం
రాతివేత దూరాన చేతులెత్తి ప్రభు మోకరించి (2) నా తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్రన్ తీసి వేయుమనెను (2) ||అప్పగింప||
4వ చరణం
ఇదిగో వచ్చె తుది ఘడియ హృదయ బాధ హెచ్చెను (2) పదిలపరచు-నట్లు తండ్రిన్ మదిలో వదలక ప్రార్ధించుడనెను (2) ||అప్పగింప||