అర్పించు నీ జీవితము, ప్రభు యేసుని సేవ కొరకు
arpinchu nee jeevitamu, prabhu yeesuni seeva koraku
అర్పించు నీ జీవితము, ప్రభు యేసుని సేవ కొరకు సంపూర్ణ శాంతి పరిపూర్ణ ప్రేమ, క్రీస్తులో పొందరమ్ము (2)
తన రాజ్యమందు, నిను నిలుపుట కొరకు సర్వమును విడచి, ఇలనేతెంచె (2) ఆ గొప్ప కృపకై ఏమివ్వగలవు, అర్పించు నీ హృదయము (2) అర్పించు నీ హృదయము
నీ పాపమంతా తొలగింపజేయ పలు ఘోర శ్రమలన్, సహియించెనేసు (2) ఆ ప్రేమకై నీవేమివ్వగలవు, అర్పించు నీ సమయము (2) ||అర్పించు||
నీ నిత్య జీవం, కొరకై ఆ సిలువందు, మరణించి మరల, లేచెను యేసు (2) ఆ త్యాగమునకై ఏమివ్వగలవు, అర్పించు నీ తలాంతులు (2)
పరలోకమునకు నిన్ను కొనిపోవ తిరిగి రానుండే, నీ రాజు యేసు (2) ఆ స్వాస్థ్యమునకై ఏమివ్వగలవు, అర్పించు ధన సంపదలు (2) ||అర్పించు||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.
