♪♫
TG-3144
Telugu
అర్పించుచుంటిని యేసయ్
Arpinchuchuntini Yesayyaa
21
views
పల్లవి
అర్పించుచుంటిని యేసయ్యా నన్ను నీ చేతికి (2) దీనుడను నన్ను నీ బిడ్డగా ప్రేమతో స్వీకరించు (2) ||అర్పించుచుంటిని||
1వ చరణం
ఈ లోక జీవితం అల్పకాలమే నీవే నా గమ్యస్థానము (2) నిజ సంతోషం నీవు నాకిచ్చి (2) నా హృదయం వెలిగించు (2) నా ప్రభువా యేసయ్యా ||అర్పించుచుంటిని||
2వ చరణం
దప్పిగొన్న జింకవలెనే ఆశతో చేరితి నీ దరి దేవా (2) సేదతీర్చి జలము నిన్ను (2) వాడిన బ్రతుకులో (2) నింపుము జీవము ||అర్పించుచుంటిని||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.