అసామానుడైన వాడు - అవమానపరచడునిన్ను
asaamaanudaina vaadu - avamaanaparachaduninnu
అసామానుడైన వాడు - అవమానపరచడునిన్ను ఓటమిఎరుగనీ మన దేవుడు - ఒడిపోనివ్వడు నిన్ను ఘనకార్యాలెన్నో నీకై చేసినవాడు -కష్టకాలమందు నీ చేయి విడచునా అసాధ్యములెన్నో దాటించిన నాథుడు శ్రమలో నిన్ను దాటిపోవునా సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడచును (2) ||అసామానుడైన||
అగ్ని గుండాములో నెట్టివేసిన - సింహాల నోటికి నిన్ను అప్పగించిన శత్రువే నీ స్థితిచూసి అతిశయ పడుచున్న సింహాలే నీ ఎదుటే మ్రింగివేయ నిలిచిన నాకే ఎలా శ్రమలంటూ కృంగిపోకుమా తేరిచూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై శుత్రువు చేతికి నిను అప్పగించడు (2) ||అసామానుడైన||
పరిస్థితులన్నీ చేజారిపోయిన - ఎంతగానో శ్రమమపడిన ఫలితమే లేకున్నా అనుకున్నవన్నీ దూరమైపోయిన - మంచిరోజులొస్తాయనే నిరిక్షణే లేకున్నా మారదీ తలరాతని దిగులుపడకుమా మారాను మధురముగా మార్చును నీకై మేలులతో నిను తృప్తిపరచును (2) ||అసామానుడైన||
ఒంటరి పోరాటమే విసుగురేపిన పొందిన పిలుపే బారమైపోయిన ఆత్మీయులందరు అవమానిస్తున్న నమ్మదగినవారులేక నిరాశతో నిలిచిన పిలుపునే విడచి మరలిపోకుమా న్యాయాధిపతియే నాయకునిగా నిలుపును నిన్ను పిలిచిన దేవుడు నిను మరచిపోవునా (2) ||అసామానుడైన||
