TG-2425
Telugu

అతిపరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే

athiparishuddhudaa sthuthi naiveedyamu neekee

99
views
పల్లవి

అతిపరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును (2) నీవు నా పక్షమై నను దీవించగా నీవు నా తోడువై నను నడిపించగా జీవింతును నీ కోసమే – ఆశ్రయమైన నా యేసయ్యా ||అతిపరిశుద్ధుడా||

1వ చరణం

సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే ముందెన్నడూ చవిచూడని సరిక్రొత్తదైన ప్రేమామృతం నీలోనే దాచావు ఈనాటికై నీ ఋణం తీరదు ఏనాటికి (2) ||అతిపరిశుద్ధుడా||

2వ చరణం

సద్గుణరాశి నీ జాడలను నా యెదుట నుంచుకొని గడిచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగా నే పొందగా నాలోన ఏ మంచి చూసావయ్యా నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా సారెపైనున్న పాత్రగ నన్ను చేజారిపోనివ్వక శోధనలెన్నో ఎదిరించినను నను సోలిపోనివ్వక ఉన్నావులే ప్రతిక్షణమునా కలిసున్నావులే ప్రతి అడుగున నీవేగా యేసయ్యా నా ఊపిరి నీవేగా యేసయ్యా నా కాపరి

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.