TG-1005
Telugu

అత్యున్నత సింహాసనముపై

atyunnata sinhaasanamupai

225
views
పల్లవి

అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా అత్యంత ప్రేమా స్వరూపివి నీవే ఆరాధింతును నిన్నే ఆహహా - హల్లెలూయా (3) ఆహహా - హల్లెలూయా (3) అహహా ఆమేన్‌ ...

1వ చరణం

ఆశ్చర్య కరుడా స్తోత్రం ఆలోచన కర్త స్తోత్రం బలమైన దేవా నిత్యడగు తండ్రి సమాదాన అధిపతి స్తోత్రం (2) ||ఆహహా||

2వ చరణం

కృపాసత్య సంపూర్ణుడా స్తోత్రం కృపతో రక్షించితివే స్తోత్రం నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణ కర్త స్తోత్రం (2) ||ఆహహా||

3వ చరణం

మృత్యుంజయడా స్తోత్రం మహా ఘనుడా స్తోత్రం మమ్ములను కొనిపోవా త్వరలో రానున్న మేఘ వాహనుడా స్తోత్రం (2) ||ఆహహా||

4వ చరణం

ఆమేన్‌ అనువాడ స్తోత్రం అల్ఫా ఓమేగా స్తోత్రం అగ్నిజ్వాలల వంటి కన్నుల గలవాడా అత్యున్నతుడా స్తోత్రం (2) ||ఆహహా||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.