అతి శ్రేష్ఠుడా నా యేసయ్యా నీ నామమే అతి మధురం (2) దీనుల యెడల నీ కృప చూపువాడా జ్ఞానుల మధ్యన నన్ను నిలుపువాడా (2)
నా స్తుతి స్తోత్రం నీకేనయ్యా నా స్తుతికి ఆధ్యుడా ఆరాధ్యుడా ||అతి శ్రేష్ఠుడా||
శిలనైన బ్రతుకును చెక్కుకుంటివే నీ మహిమకై (2) రాతి హృదయములో రాగాలు పుట్టించే నీ వాక్యమే (2) నన్ను స్థిరపరచి బలపరచి నీ స్వాస్థ్యము నిచ్చితివా (2) ||నా స్తుతి||
కృంగిన నా బ్రతుకును కనికరించితివే నీ కృపతో (2) ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికెక్కించిన నీ కృప (2) నాలో సెలయేరై ప్రవహించే నా మదిలో (2) ||నా స్తుతి||
పనికిరాని నన్ను పిలుచుకుంటివే నీ సేవకై (2) నీదు పత్రికగా నన్ను మార్చుకున్న పరిశుద్ధుడా (2) నిన్ను ప్రకటించి కీర్తించి పరలోకం చేరెదను (2) ||నా స్తుతి|| అతి శ్రేష్ఠుడా… పరిశుద్ధుడా పరిపూర్ణుడా… మృత్యుంజయుడా (2)
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.
