TG-3151
Telugu

అవధులే లేనిది దివ్యమైన

Avadhule Lenidi Divyamaina

11
views
పల్లవి

అవధులే లేనిది దివ్యమైన నీ కృప అనంతమైనది ఆశ్చర్యమైనది (2) యేసయ్యా నాపై నీవు చూపిన కృప అమూల్యమైనది వర్ణించలేనిది (2) ||అవధులే||

1వ చరణం

ఊహించలేని హృదయానందమును దుఃఖమునకు ప్రతిగా దయచేసినావు (2) భారమెక్కువైనా తీరం కడుదూరమైనా నీపై ఆనుకొందును నేను గమ్యం చేరుకొందును (2) ||అవధులే||

2వ చరణం

సరిపోల్చలేని మధురమైన అనుభవం వింతైన నీ ప్రేమలో అనుభవింపజేశావు (2) సౌందర్యమైన అతిపరిశుద్ధమైన నీ రూపము తలచుకొందును నేను నీ కోసమే వేచియుందును (2) ||అవధులే||

3వ చరణం

లెక్కించలేని అగ్ని శోధనలో ప్రయాసమునకు తగిన ఫలములిచ్చినావు (2) వాడబారని కిరీటము నే పొందుటకు వెనుకున్నవి మరచి నేను లక్ష్యము వైపు సాగెద (2) ||అవధులే||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.