TG-3326
Telugu

అవని అంతటిలో అతిశ్రేష్టుడా

avani antatiloo atishreeshtudaa

Blessing Kumarవిజయ్ · Vijayపాస్టర్ కరుణ్ కుమార్ · Pastor Karun Kumar
0
views
Chorus

అవని అంతటిలో అతి శ్రేష్టుడా ఆరాధనకు అర్హుడ (2) నా యేసయ్య నీవు మాత్రమే విడిపించువాడవు రక్షించువాడవు (2) ||అవని అంతటిలో||

1వ చరణం

నిర్దోషమైన నీ ఉపదేశములు నెమ్మదిని నొసగెను (2) నిష్కళంకుడా నీవే నా దైవము (2) మనలేను నీవులేక క్షణమైనను కొనియాడి కీర్తించి ప్రణమిల్లేద (2) ||అవని అంతటిలో||

2వ చరణం

క్షేమకరమైన నీ ఉద్దేశములు నన్ను స్థిరపరచెను (2) క్షేమా ధారమా నీవే నా దుర్గము (2) మనలేను నీవులేక క్షణమైనను కొనియాడి కీర్తించి ప్రణమిల్లేద (2) ||అవని అంతటిలో||

3వ చరణం

ఉత్తమమైన నీ న్యాయవిధులే నన్ను ఘనపరచెను (2) ఉన్నతా దుర్గమా నీవే నా వైభవం (2) మనలేను నీవులేక క్షణమైనను కొనియాడి కీర్తించి ప్రణమిల్లేద (2) ||అవని అంతటిలో||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.