అవనిలో ఉద్భవించె ఆది సంభూతిని

avaniloo udbhavinche aadi sanbhuuthini

🎵 TG-2784🌐 Telugu
పల్లవి

అవనిలో ఉద్భవించె ఆది సంభూతిని చూడరే పుడమియే పరవశించె పసిబాలుని చూడగనే… పసిబాలుని చూడగనే ఆకాశమే పట్టనోడు – ధరణిలో పుట్టినాడు దావీదు పురమునందు దీనుడై – వెలసినాడు రక్షకుడు (2) ఆనందమే మహా ఆనందమే – అందరికి ఇలలో సంతోషమే ఆశ్చర్యమే ఇది అద్భుతమే – యేసు జననం అద్భుతమే అదృశ్య దేవుని మహిమ స్వరూపుడు ఆది అంతమైన పరలోక నాథుడు ఆదియందు వాక్యంబుగా – సృష్టి కార్యము జరిగించినాడు అనాది నుండి జ్ఞానంబుగా – సృష్టి క్రమము నడిపించినాడు అన్నిటిని కలిగించిన మహరాజు కన్నీటిని తుడచుటకు దిగివచ్చినాడు (2)     ||ఆనందమే||

1వ చరణం

ప్రేమను పంచే ప్రేమామయుడు రక్షణ ఇచ్చే రక్షించే దేవుడు పాపమే లేని సుగుణాల సుందరుడు శాపము బాపను జన్మించెను చూడు నిత్యముండు నీతి సూర్యుడు – సత్యసాక్షిగా ఇలకొచ్చినాడు ప్రేమను పంచే పావనాత్ముడు – పశుల పాకలో పవళించినాడు సర్వాధికారియైన మహరాజు దీనులకు దీవెనగా దిగి వచ్చినాడు (2) ||ఆనందమే||

2వ చరణం

||ఆకాశమే||

Report Error