TG-4552
Telugu

అయ్యా నా యేసయ్య నీ ప్రేమ శాశ్వతము

Ayyaa Naa Yeesayya Nee Preema Shaashvathamu

12
views
పల్లవి

అయ్యా నా యేసయ్య నీ ప్రేమ శాశ్వతము అయ్యా నా యేసయ్య నీ కృపయే శాశ్వతము నీ మాటకు లోబడితే నా వంశములన్నిటనూ దీవెన వర్షమునే గడిగడియకు చూసెదను ఆశీర్వాద శిఖరముపై నా గుడారమేయుటకు కొలతలులేని కనికరము నాపైన నిలిపావు చూపులతోనే పాపమును సంపూర్ణం చేసాను పొరుగువాని ప్రతి భాగమును నిత్యం ఆశించువాడను తేనెకంటే నునుపైన పదములు కురిపించి వేషధారినై జీవిస్తూ ముందుకు సాగితిని మేలు చేయాలనుకున్నా కీడును మానలేకున్నా పితరుల నడవడి నాలోనా శ్వాసగా మారింది అపవాది బంధీగా చెరగొనిపోయెను మనుష్యుల ఊహకందనంత చీకటి అయ్యాను తెలియనిదేదీ లేదంటూ అన్నీ నాకే తెలుసంటూ వాక్యమునెరిగిన నిపుణుల మాటలు గారడి పలుకులు అన్నాను తర్కములు చేయుటయే సువార్త అనుకున్నా వాదములో గెలుచుటయే నీసేవనుకున్నా

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.