TG-230
Telugu

అయ్యో యిది దుఃఖము ప్రభు

ayyoo yidi duhkhamu prabhu

208
views
పల్లవి

అయ్యో యిది దుఃఖము ప్రభు తీర్పువేళ నయ్యో యిది యెంత దుఃఖము చయ్యన యెహోవా సింహా సనము చుట్టు వహ్ని మండు నయ్యెడ విశ్వాసులకు దు రాత్మల కగు నిత్య ఖేద ||అయ్యో యిది||

1వ చరణం

తల్లి పిల్లలు గూడుదు రచటఁ దండ్రి తాత లచటఁ గలియుదు రెల్ల కాల మటుల నుండ కెడబడి మరి యెపుడు చూడ ||అయ్యో యిది||

2వ చరణం

అన్నదమ్ములచటఁ గూడుదురు రక్క సెలియలందుఁ గలియుదు రెన్నఁ డు మరి చూడ రాని యెడఁగల స్థలములకుఁ బోదు ||అయ్యో యిది||

3వ చరణం

భార్యాభర్తలు గూడుదురు రచట బంధు మిత్రులు కలియుదురు రందుఁ కార్య భేదమువలన సర్వ కాలము మరి కూడఁజాల ||అయ్యో యిది||

4వ చరణం

క్రీస్తు మత ప్రబోధకులు స మస్త శిష్యులు కూడుదు రచట వాస్తవ స్థితు లెరుఁగఁబడిన వలనను విడఁబడుదు రంద ||అయ్యో యిది||

5వ చరణం

శిష్టులు దుష్టులు కూడుదు రచట స్నేహవంతు లందుఁ గలియుదు రిష్టము గాని భిన్నులగుచు నిఁక మరి యెన్నటికిఁ గూడ ||అయ్యో యిది||

6వ చరణం

అల పిశాచి పాపు లందరు నడుపు కర్తకు భిన్ను లగుచు పలుగొరుకుల నిత్య నరక బాధల పాల్బడక పోరు ||అయ్యో యిది||

7వ చరణం

సాధు సజ్జనంబు లెల్ల సకల దూతలతోడఁ గూడి మోదముతో ప్రభుని వెంట ముక్తి కేగి నిత్యులగుదు రాహా యిది యెంత విజయము ప్రభు తీర్పు వేళ నాహా యిది యెంత విజయము ||అయ్యో యిది||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.