బాలకా నీ వర్తనము గా పాడుకొని జీవింపరా మేలులుకుఁ బలు కీడు లకునదె మూలమనిగమనింపరా ||బాలకా నీ||
తప్పినడువకు మెన్నడేని తల్లిదండ్రులు యానతి తప్పిపోయిన సుతుఁడు పడిన తిప్పలు నీ వెఱుఁగవా? ||బాలకా నీ||
గోలచేయుచుఁ బెద్దలనుగని మేలమాడుట తగదురా బాలురా యెలిషాను నవ్వి ప్రాణగొడ్డమునొందరే ||బాలకా నీ||
పరులకెగ్గొనరింపఁబోకుము దొరలునదినీ మీఁదనే పరునికై హామాను నిల్పిన కొఱఁత నతఁడే వ్రేలఁడే ||బాలకా నీ||
కట్టఁడి కార్యంబుతుదకుఁ బట్టి కుడుపకపోదురా మిట్టిపడిన రాణి యెజెబె లెట్టులీల్గెనొ తెలియదా? ||బాలకా నీ||
వగవకుము పరధనముఁగనియది తెగులులేని బాధరా సుగతిగనెనె యాహబుతా శునకముల కాహారమై? ||బాలకా నీ||
ఆనృతంబులాడకుము దే హాంతమైన నేమిరా? ఆనృతము చేనని యాతన యాలితో సహకూలఁడే ||బాలకా నీ||
కోపమునకాన్పదమునీయఁ గోరకుము మదినెన్నడు కోప జ్వాలలు పెంచికయ్యిను గోడు చెందడె హంతయై ||బాలకా నీ||
తులువల జత గూడిమాడి చెలిమిచేయుట తగదురా పలువల సాంగత్యమున రెహ బాము భంగము నొందఁడే ||బాలకా నీ||
బాలుడా నీ తరుణ హృదయము ప్రభున కప్పగింపరా శీల సౌష్ఠవ మొదవునీ కా శీస్సులను జేకూరురా ||బాలకా నీ||