బంగారం కన్న ఎంతో శ్రేష్టమైనది - పరిశుద్ధమైన బైబిల్‌ గ్రంధము

bangaaram kanna enthoo shreesstamainadi - parishuddhamaina baibil‌ grandhamu

🎵 TG-1149🌐 Telugu
పల్లవి

బంగారం కన్న ఎంతో శ్రేష్టమైనది - పరిశుద్ధమైన బైబిల్‌ గ్రంధము (2)

1వ చరణం

గ్రంధాలలో అది రాజ గ్రంధము - వేధాలలో అది సత్యవేదము (2) నిజమైన మార్గము చూపు దీపము (2) హల్ల్లేలుయా.. హల్లేలుయా..హల్లేలుయా..హల్లెలూయా.. ||బంగా||

2వ చరణం

బుద్దిహీనులకు జ్ణానమిచ్చును - యవ్వనులకు ఉపదేశమిచ్చును (2) బాగుగ పఠియించి మేలు పొందుము (2) ||హల్లే||

3వ చరణం

దేవుని వాక్యమును ప్రేమించుము - అది నీకు ఎంతో నెమ్మదిచ్చును (2) నీ భాధలలో నిన్ను ఆదుకొనును (2) ||హల్లే||

4వ చరణం

నీ పాప జీవితమును మార్చివేయును - పాపము చేయకుండ కాపాడును (2) నీ మార్గములను వెలిగించును (2) ||హల్లే||

5వ చరణం

భూమి, ఆకాశములు గతియించును - దేవుని మాటలు గతియింపవు (2) అవియన్ని నిజముగ నెరవేరును (2) ||హల్లే||

Report Error