బంగారు బొమ్మవు నీవమ్మా వధువు సంఘమా రావమ్మా
bangaaru bommavu neevammaa vadhuvu sanghamaa raavammaa
బంగారు బొమ్మవు నీవమ్మా వధువు సంఘమా రావమ్మా శృంగార ప్రభువు యేసమ్మ వరుడు క్రీస్తు గొరియ పిల్లమ్మ
పశ్చాత్తాపమే పెండ్లి చూపులమ్మా- పాప క్షమాపనే నిశ్చితార్దమమ్మా విరిగిన మనసే వరుని కట్నమమ్మా- నలిగిన హృదయమే పెళ్లి పత్రికమ్మా గొరియ పిల్ల రక్తములొ తడిచిన - పవిత్ర కన్యవై నిలచేవమ్మా ||బంగారు||
కొరడా దెబ్బలే పెండ్లి నలుగమ్మా- అసూయ ద్వేషాలే సుగంధ ద్రవ్యమమ్మా నెత్తుటి ధారలే పెళ్లి చీరమ్మా - ముళ్ళ కిరీటమే పెండ్లి ముసుగమ్మా ప్రకాశమానమై నిర్మలమయమై పరిశుద్ధ క్రియలై నడిచేవమ్మా ||బంగారు||
కల్వరి కొండే పెళ్లి పీటమ్మా - దేవుని దూతలే పెండ్లి సాక్షులమ్మా సిలువ దండనే పెండ్లి సూత్రమమ్మా - దూషణ క్రియలే పెండ్లి అక్షింతలమ్మా సువర్ణమయమై స్వచ్చమైన స్పటికమువలే మెరిసేవమ్మా ||బంగారు||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.