♪♫
TG-5529
Telugu
బేతలేము నిదురబోయే చిన్ని మెస్సయ్యా
Beethaleemu Nidurabooyee Chinni Messayyaa
0
views
పల్లవి
బేతలేము నిదురబోయే చిన్ని మెస్స య్యా కనుమూసి కాసేపు నిదురపోవయ్యా (2) ఆ దూతల సైన్యాలే నింగిలో నిలిచే పరిశుద్ధుడు నీవంటూ పాటలు పాడే (2) నింగిలోని రంగులీను బంగారు తార నీవే రారాజువని రయముగ చాటే (2) ||బేతలేము||
1వ చరణం
కల్ల కపట మెరుగని గొల్లలు కూడి నీవే తమ రక్షణయని స్త్రోత్రము పాడా (2) దూర తీరములను దాటి జ్ఞానులొచ్చిరి నీవే మహారాజువని నిన్నే కొలిచిరి (2) ||బేతలేము||
2వ చరణం
తరములలో మర్మమైన దివ్యరూపుడా ధరణిలోన వెలసినావు దేవసుతునిగా (2) నరులనెల్ల పరము జేర్చు రక్షణ వెలుగై ప్రకాశింప జనియించిన మహిమతేజుడా (2) ||బేతలేము||