బెత్లెహేము పురమందున రారాజు పుట్టాడంట
Bethleheemu Puramanduna Raaraaju Puttaadanta
బెత్లెహేము పురమందున - రారాజు పుట్టాడంట రారండి జనులారా - రక్షకుని చూసొద్ధాం ఆడి పాడి ఆనందిద్దాం బెత్లెహెము పురమందున - రారాజు పుట్టాడంట రారండి జనులారా - ఆడి పాడి ఆనందిద్దాం (2) కలిసి మెలిసి పోదాం - రక్షకుని చూసొద్ధాం (2) అ.ప:ఆనందం పరమానందం - నింగీ నీలా పరవశం (2) ||బెత్లెహేము||
గొల్లలకు శుభవార్త - అభయమిచ్చి దూత చెప్పింది దావీదు పురమందు - రక్షకుండు పుట్టాడని (2) దివియందు దేవునికి మహిమ - భువియందు సమాధానం (2) ఇదియే కదా నిజమైన క్రిస్మస్ ఆనందం ఆనందం పరమానందం - నింగీ నీలా పరవశం (2) ||బెత్లెహేము||
పాపాల వలయంలో - మనుజులు పడివున్నప్పుడు పాపాన్ని రూపుమాప - పరిశుద్ధుడు ఇలకేతెంచెన్ (2) కన్య మరియ గర్భాన్న - మనుజావతారుడై పుట్టెన్ (2) ఇదియే కదా నిజమైన క్రిస్మస్ ఆనందం ఆనందం పరమానందం - నింగీ నీలా పరవశం (2) ||బెత్లెహేము||
నింగిలో వింతైన తారా - జ్ఞానులకు దారి చూపింది రారాజుని గాంచి - కానుకలు అర్పించి పూజించిరి (2) రారాజు జననం మానవాళికే వరం - విరోధికే కలవరం (2) ఇదియే కదా నిజమైన క్రిస్మస్ ఆనందం ఆనందం పరమానందం - నింగీ నీలా పరవశం (2) ||బెత్లెహేము||