TG-3164
Telugu

బేత్లేహేం పురమున

Bethlehem Puramuna

11
views
పల్లవి

బేత్లేహేం పురమున చిత్రంబు కలిగె కర్తాది యేసు జన్మించినపుడు అంధకారంపు పృథివి వీధులలో మోదంపు మహిమ చోద్యంబుగానరే ఉదయంపు తారల్ ముదమున బాడే ఉదయించ యేసు ఈ పృథివిలోన ముదమును గలిగె మరి సమాధానం పదిలంబుతోడ పూజించ రండి ||బేత్లేహేం||

1వ చరణం

పరమును విడచి నరరూపమెత్తి అరుదెంచి యేసు పరమ వైద్యుండై నరుల దుఃఖములన్ తొలగించివేసి పరలోక శాంతి స్థిరపరచె ప్రభువు ||బేత్లేహేం||

2వ చరణం

నీదు చిత్తమును నాదు హృదయమున ముదమున జేయ మదినెంతో యాశ నీదు పాలనము పరమందు వలెనె ఈ ధరణియందు జరుగంగ జూడ ||బేత్లేహేం||

3వ చరణం

దేవుని సన్నిధి దీనత నుండ పావనయాత్మ పవిత్ర పరచున్ పావనుడేసు ప్రకాశమిచ్చి జీవంబు నొసగి జీవించు నెదలో ||బేత్లేహేం||

4వ చరణం

గతించె రాత్రి ప్రకాశించె కాంతి వితానముగ వికసించె నెల్ల దూతల ధ్వనితో పతి యేసు క్రీస్తు అతి ప్రేమతోడ అరుదెంచె నోహో ||బేత్లేహేం||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.