TG-2561
Telugu

భారత దేశమా యేసుకే నా

bhaaratha deeshamaa yeesukee naa

130
views
పల్లవి

భారత దేశమా యేసుకే నా భారత దేశమా ప్రియ యేసుకే (2) నువ్వు సొంతం కావాలన్నదే నా ప్రార్థన నిను సొంతం చేయాలన్నదే నా ధ్యేయం యేసు నామమే జయము జయమని ఇహమంత మారుమ్రోగిపోవాలి పని చేయుచున్న సాతాను శక్తులు పటా పంచలైపోవాలి భారత దేశమా నా భారత దేశమా నా ప్రియ యేసునికే నీవు సొంతం కావాలి ఉగ్రతలోనుండి నీవు రక్షణ పొందాలి సృష్టికర్తనే మరచి – భారత దేశమా సృష్టిని పూజించుట తగునా – నా భారత దేశమా ఈ లోకమును సృష్టించిన యేసే – భారత దేశమా నిను రక్షించుటకు ప్రాణం పెట్టెను – భారత దేశమా భారత దేశమా యేసుని చేరుమా నూతన సృష్టిగ మార్చబడుదువు భారత దేశమా శాంతికి అధిపతి ఆ యేసే – భారత దేశమా శాంతి రాజ్యమును స్థాపించును – నా భారత దేశమా లోకమంతయు లయమైపోవును – భారత దేశమా లోకాశలన్నియు గతించిపోవును – భారత దేశమా శాంతి సమాధానములను పొందుము భారత దేశమా రాజుల రాజుగ మన యేసే – భారత దేశమా పెండ్లి కుమారుడై రానుండె – నా భారత దేశమా యేసుని నమ్మిన దేశములన్ని – భారత దేశమా యేసుతో కూడ కోనిపోబడును – భారత దేశమా సువర్ణ దేశముగ మార్చబడుదువు భారత దేశమా భారత దేశమా నా యేసుకే భారత దేశమా ప్రియ యేసుకే

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.