భాసిల్లెను సిలువలో పాపక్షమా
Bhaasillenu Siluvalo Paapa
భాసిల్లెను సిలువలో పాపక్షమా యేసు ప్రభూ నీ దివ్య క్షమా ||భాసిల్లెను||
కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను యాహుతి చేసి కలుషహరా కరుణించితివి (2) ||భాసిల్లెను||
దోషము చేసినది నేనెకదా మోసముతో బ్రతికిన నేనెకదా మోసితివా నా శాపభారం (2) ||భాసిల్లెను||
పాపము చేసి గడించితి మరణం శాపమెగా నేనార్జించినది కాపరివై నను బ్రోచితివి (2) ||భాసిల్లెను||
నీ మరణపు వేదన వృధా గాదు నా మది నీ వేదనలో మునిగెను క్షేమము కలిగెను హృదయములో (2) ||భాసిల్లెను||
ఎందులకో నాపై ఈ ప్రేమ అందదయ్యా స్వామీ నా మదికి అందులకే భయమొందితిని (2) ||భాసిల్లెను||
నమ్మిన వారిని కాదన వనియు నెమ్మది నొసగెడి నా ప్రభుడవని నమ్మితి నీ పాదంబులను (2) ||భాసిల్లెను||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.