భాసిల్లెను సిలువలో పాపక్షమా యేసు
bhaasillenu siluvaloo paapakssamaa yeesu
🎵 TG-2268🌐 Telugu
పల్లవి
భాసిల్లెను సిలువలో పాపక్షమా యేసు ప్రభూ నీ దివ్య క్షమా ||భాసిల్లెను||
1వ చరణం
కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను యాహుతి చేసి కలుషహరా కరుణించితివి (2) ||భాసిల్లెను||
2వ చరణం
దోషము చేసినది నేనెకదా మోసముతో బ్రతికిన నేనెకదా మోసితివా నా శాపభారం (2) ||భాసిల్లెను||
3వ చరణం
పాపము చేసి గడించితి మరణం శాపమెగా నేనార్జించినది కాపరివై నను బ్రోచితివి నీ మరణపు వేదన వృధా గాదు నా మది నీ వేదనలో మునిగెను క్షేమము కలిగెను హృదయములో ఎందులకో నాపై ఈ ప్రేమ అందదయ్యా స్వామీ నా మదికి అందులకే భయమొందితిని నమ్మిన వారిని కాదన వనియు నెమ్మది నొసగెడి నా ప్రభుడవని నమ్మితి నీ పాదంబులను