TG-3172
Telugu

భజన చేయుచు భక్తపాలక

Bhajana Cheyuchu Bhakthapaalaka

0
views
పల్లవి

భజన చేయుచు భక్తపాలక ప్రస్తుతింతు నీ నామమును (2) వృజినములపై జయము నిచ్చిన (2) విజయుడా నిను వేడుకొందు ||భజన||

1వ చరణం

దివ్య పదవిని విడిచి నీవు దీనుడవై పుట్టినావు (2) భవ్యమైన బోధలెన్నో (2) బాగుగా ధర నేర్పినావు ||భజన||

2వ చరణం

నరుల గావను పరమునుండి ధరకు నీవు వచ్చినావు (2) పరుడ నైన నా కొరకు నీ (2) ప్రాణము నర్పించినావు ||భజన||

3వ చరణం

చెడినవాడ నైన నన్ను జేరదీసి ప్రోచినావు (2) పడిన నాడు గోతి నుండి (2) పైకి లేవనెత్తి నావు ||భజన||

4వ చరణం

ఎంత ప్రేమ ఎంత దయ ఎంత కృప యేసయ్య నీకు (2) ఇంతయని వర్ణింప నిలలో (2) నెవనికిని సాధ్యంబు కాదు ||భజన||