TG-3173
Telugu

భజియింతుము నిన

Bhajiyinthumu Ninu

14
views
పల్లవి

భజియింతుము నిను జగదీశా శ్రీ యేసా మా రక్షణ కర్తా (2) శరణు శరణు మా దేవా యెహోవా మహిమాన్విత చిర జీవనిధి (2) ||భజియింతుము||

1వ చరణం

విమల సెరాపులు దూత గణంబులు చూడగ లేని తేజోనిధివే (2) మా యధములకై సిలువ మ్రానుపై దీనుడవై మరణించితివే (2) ||శరణు||

2వ చరణం

ప్రప్రధముడ మరి కడపటి వాడా మృతుడై బ్రతికిన నిరత నివాసి (2) నీ భజనలు మా జీవనాధారం చేకొనవే మా స్తుతి గీతం (2) ||శరణు||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.