TG-3174
Telugu

భజియింతుము రారే యేసుని

Bhajiyinthumu Raare Yesuni

0
views
పల్లవి

భజియింతుము రారే యేసుని స్తోత్ర గీతముతో గళములెత్తి కీర్తింతుము శ్రేష్ఠ గానముతో (2) కొనియాడి పాడెదము కీర్తించి పొగడెదము (4) ||భజియింతుము||

1వ చరణం

రారాజు క్రీస్తు రమ్యముగా సేవించి ప్రభువుల ప్రభువును పూజించి స్తుతియించి (2) సుందరుడగు యేసు నామం (2) స్తుతించి భజించి పాడెదము ||భజియింతుము||

2వ చరణం

పాపములను బాపును ప్రభు యేసుని రక్త ధారలు పరమున నిన్ను చేర్చును ప్రభుని దివ్య వాక్కులు (2) పాపముల వీడి యేసుని (2) స్తుతించి భజించి పాడెదము ||భజియింతుము||