TG-3175
Telugu

భక్తులారా స్మరియించెదము

Bhakthulaaraa Smariyinchedamu

0
views
పల్లవి

భక్తులారా స్మరియించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని (2) అడిగి ఊహించు వాటి కన్నా మరి (2) సర్వము చక్కగ చేసె (2) ||భక్తులారా||

1వ చరణం

గాలి తుఫానులను గద్దించి బాధలను తొలగించే (2) శ్రమలలో మనకు తోడైయుండి శ్రమలలో మనకు తోడైయుండి బయలు పరచె తన జయమున్ (2) ||భక్తులారా||

2వ చరణం

ఈ భువియందు జీవించు కాలం బ్రతికెదము ప్రభు కొరకే (2) మనమాయనకర్పించుకొనెదము మనమాయనకర్పించుకొనెదము ఆయన ఆశయమదియే (2) ||భక్తులారా||

3వ చరణం

కొంచెము కాలమే మిగిలియున్నది ప్రభువును సంధించుటకై (2) గనుక మనము నడచుకొనెదము గనుక మనము నడచుకొనెదము ప్రభు మార్గముల యందు (2) ||భక్తులారా||