భయమేల క్రైస్తవుండా నీవిక నపజయమున
bhayameela kraisthavundaa neevika napajayamuna
భయమేల క్రైస్తవుండా నీవిక నపజయమున బ్రతుకనేల జయ శూరుడగు ప్రభువు యిలనీకు జయము నిచ్చుచు నుండగ ||భయమేల క్రైస్తవుండా||
భూతపీడితుల నెల్ల విడిపించుదాత మన రక్షకుండు సాతాను వల నుండియు విడిపించిప నీతితో మనుపలేడా ||భయమేల క్రైస్తవుండా||
మరణ పాశములనుండి లాజరును కరుణతో లేపలేదా ధరణిమిమ్ముల నూతన బలముతో గుఱికి నడిపించలేడా ||భయమేల క్రైస్తవుండా||
ద్రాక్షరసముగ నీళ్లను మార్చిన మహిమగల రక్షకుండు అక్షయ సంతసంబు నిలమీకు దీక్షతో నివ్వలేడా ||భయమేల క్రైస్తవుండా||
ఐదు చిన్న రొట్టెలు మరి రెండు చిన్న చేపలతోడును ఐదువేల మందిని బలపర్చినట్టి రక్షకుడుండగ ||భయమేల క్రైస్తవుండా||
విజయకరముగ బ్రతుకు ప్రభువుండు నిజవాగ్దత్తము లివ్వ నీ వృజినము గెలువంగను ముదముతో నిజముగ నెరవేర్చడా ||భయమేల క్రైస్తవుండా||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.