భూమండలము దాని సంపూర్ణత యును

bhuumandalamu daani sanpuurnnatha yunu

🎵 TG-024💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

భూమండలము దాని సంపూర్ణత యును లోకమును భూమండల వాసులను బొల్పార యెహోవావే ||భూమండలము దాని||

1వ చరణం

యెహోవ సంద్రము మీఁద భుమి పునాది వేసె మహాజలమూల మీఁద మనదేవుఁడది స్థిరపర్చె ||భూమండలము దాని||

2వ చరణం

యెహోవ పర్వతమునకు నెక్కంగఁ బాత్రుడెవఁడు మహాలయంబునందు మరి నిల్వ యోగ్యుం డెవఁడు ||భూమండలము దాని||

3వ చరణం

అపవిత్ర మనసులేక కపట ప్రమాణము లేక సుపవిత్రమౌ చేతులను శుద్ధాత్మ గల్గినవాఁడే ||భూమండలము దాని||

4వ చరణం

ఆలాటి వాఁడు ప్రభుని యాశీర్వచనము నొందు భులోకమున రక్షణ దేవుని నీతి మత్వముపొందు ||భూమండలము దాని||

5వ చరణం

ప్రభునాశ్ర యించు నట్టి వారు యాకోబు దేవ ప్రభుసన్నిధానము వెదకు ప్రజలెల్ల రట్టివారే ||భూమండలము దాని||

6వ చరణం

ద్వారంబు లార యింక మీ తల లెల్లబైకెత్త వలెన్ రారాజు కొరకుఁతలుపులాలా మిమ్మెత్తుకొనుఁడి ||భూమండలము దాని||

7వ చరణం

ఇలలో మహా మహిమంబు గలిగిన యీ రాజెవఁడు బలశౌర్యముల యెహోవ బహుశూరుడౌ యెహోవ ||భూమండలము దాని||

Report Error