♪♫
TG-2257
Telugu
భూమ్యాకాశములు సృజించిన యేసయ్యా నీకే
bhuumyaakaashamulu srujinchina yeesayyaa neekee
82
views
పల్లవి
భూమ్యాకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం (2) నీ ఆశ్ఛర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును హల్లెలూయ లూయ హల్లెలూయా (4) బానిసత్వమునుండి శ్రమల బారినుండి విడిపించావు నన్ను దీన దశలో నేనుండగా నను విడువవైతివి (2) ||భూమ్యాకాశములు||
1వ చరణం
జీవాహారమై నీదు వాక్యము పోషించెను నన్ను ఆకలితో అల్లాడగా నను తృప్తిపరచితివి భుజంగములను అణచివేసి కాచినావు నన్ను ఆపదలో చిక్కుకొనగా నన్ను లేవనెత్తితివి నూతన యెరూషలేం నిత్యనివాసమని తెలియజేసితివి నిట్టూర్పులలో ఉండగా నను ఉజ్జీవ పరచితివి
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.