♪♫
TG-2046
Telugu
బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా నిలవాలని
brathakaalani unnaa brathakaleekunnaa nilavaalani
80
views
పల్లవి
బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా నిలవాలని ఉన్నా నిలవలేకున్నా (2) చూడాలని ఉన్నా చూడలేకున్నా చేరాలని ఉన్నా నిను చేరలేకున్నా బ్రతికించుమో యేసయ్యా దరి చేర్చుమో నన్నయ్యా ||బ్రతకాలని||
1వ చరణం
కాపరి లేని గొర్రెనైతి కాటికి నే చేరువైతి కావలి లేని తోటనైతి కారడవిగా నే మారితి గూడు చెదరిన గువ్వనైతి గుండె పగిలిన ఎకాకినైతి గుండె దిగులుగా ఉందయ్యా గూడు చేర్చుమో యేసయ్యా నా ఆశలే అడియాశలై అడుగంటెనే నా జీవితం శోధనల సుడివడిలో తొట్రిల్లెనే నా పయనం చుక్కాని లేని నావనైతి గమ్యం తెలియక అల్లాడుచుంటి గురి చేర్చుమో యేసయ్యా గుండె గుడిలో నీవుండయ్యా
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.