TG-4924
Telugu

చాలా గొప్పోడు చాలా చాలా గొప్పోడు

Chaalaa Goppoodu Chaalaa Chaalaa Goppoodu

16
views
పల్లవి

చాలా గొప్పోడు – చాలా చాలా గొప్పోడు నేను నమ్మిన నా యేసుడు చాలా గొప్పోడు – చాలా చాలా గొప్పోడు నాకు దొరికిన నా యేసుడు (2) మాటలలో చెప్పలేనంత చేతలలో చూపలేనంత (2) చాలా చాలా చాలా చాలా – చాలా గొప్పోడు చాలా చాలా చాలా చాలా – చాలా మంచోడు (2) ||చాలా||

1వ చరణం

నా పాప శిక్షను తాను మోసెను నా కొరకు కలువారిలో త్యాగమాయెను (2) తన ప్రేమ వర్ణనాతీతం తన జాలి వర్ణనాతీతం (2) ||మాటలలో||

2వ చరణం

యేసయ్యకు సాటి ఎవ్వరు లేరు జగమంతా వెదకినా కానరారులే (2) తన ప్రేమ వర్ణనాతీతం తన జాలి వర్ణనాతీతం (2) ||మాటలలో||

3వ చరణం

ఈలాంటి ప్రేమ ఎక్కడ లేదు వింతైన ప్రేమ అంతు చిక్కదు (2) కలువరిలో చూపిన ప్రేమ శాపమునే బాపిన ప్రేమ (2) ||మాటలలో||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.