చాటించుఁడి మనుష్యజాతి కేసు నామము
chaatinchumdi manussyajaathi keesu naamamu
పల్లవి
చాటించుఁడి మనుష్యజాతి కేసు నామము చాటించుఁడి యవశ్య మేసు ప్రేమ సారము జనాదులు విశేష రక్షణసునాదము విను పర్యంతము. ||చాటించుఁడి మనుష్యజాతి||
1వ చరణం
కన్నీళ్లతో విత్తెడువార లానందం బుతో నెన్నఁడు గోయుదు రనెడి వాగ్ద తంబుతో మన్నన గోరు భక్తులార నిండు మైత్రితో మానవ ప్రేమతో ||చాటించుఁడి మనుష్యజాతి||
2వ చరణం
సమీపమందు నుండు నేమో చావుకాలము సదా నశించిపోవువారి కీ సుభాగ్యము విధంబుఁ జూపఁగోరి యాశతోడ నిత్యము విన్పించుచుందము. ||చాటించుఁడి మనుష్యజాతి||