చాటుఁడి శుభవార్తను బోధకులారా చాటుఁడి
chaatumdi shubhavaarthanu boodhakulaaraa chaatumdi
చాటుఁడి శుభవార్తను బోధకులారా చాటుఁడి శుభవార్తను జాటుఁ డి శుభవార్త సకల రాష్ట్రములలోఁ జాటించుఃడని చెప్పె ఢాటిగఁ ప్రభు యేసు ||చాటుఁడి శుభవార్తను||
లోకమును ప్రేమించి లోకరక్షణ కొఱకు ప్రాకటంబుగ సుతునిఁ బంపె దేవుఁడటంచుఁ ||చాటుఁడి శుభవార్తను||
శత్రువుల రక్షింప మిత్రుఁడుగా వచ్చి మైత్రి నసుపు నిచ్చి మరల లేచెన టంచుఁ ||చాటుఁడి శుభవార్తను||
ఎట్టి పాపు లైనఁ బట్టి యేసుని మాట దిట్టముగ నమ్మినఁ బట్టుగ క్షమియించుఁ ||చాటుఁడి శుభవార్తను||
హృదయ శుద్ధిని గోరి సదయుఁడగు రక్షకునిఁ పదిలముగఁ ప్రార్ధింపఁ పరిశుద్ధాత్మ నొసంగుఁ ||చాటుఁడి శుభవార్తను||
నమ్మి బాప్తిస్మంబు నెమ్మిఁ బొందిన మనుజు లిమ్ముగఁ బొందుదు రిలను ఘన రక్షణముఁ ||చాటుఁడి శుభవార్తను||
ఇందు నందు మికుఁ బొందుగ నొసఁగును సందియము లేకుండ సకల భాగ్యము లనుచుఁ ||చాటుఁడి శుభవార్తను||