TG-3527
Telugu

కలలా ఉన్నది

Kalalaa Unnadi

0
views
పల్లవి

కలలా ఉన్నది నేనేనా అన్నది నిజమౌతున్నది నీవు నాతో అన్నది నిరాశల నిశిలోన – ఉషోదయం వచ్చింది యేసు నీ ప్రేమే నను బ్రతికించెను (2) ||కలలా||

1వ చరణం

మనుష్యులంతా మనసే గాయపరిచి పురుగల్లె నను నలిపేయ జూచినా (2) శూరుడల్లె వచ్చినావు నాకు ముందు నిలచినావు నాకు బలము ఇచ్చినావు ఆయుధంగా మార్చినావు చల్లని నీ నీడలో నిత్యము నిలువనీ ||కలలా||

2వ చరణం

శూన్యములో నాకై సృష్టిని చేసి జీవితాన్ని అందముగా మలచేసి (2) మాట నాకు ఇచ్చినవారు దాన్ని నెరవేర్చువారు నిన్ను పోలి ఎవరున్నారు నన్ను ప్రేమించువారు యేసు నీ ప్రేమను ప్రతి దినం పాడనీ ||కలలా||