♪♫
TG-3522
Telugu
కానెన్నడు నేను అనాథన
Kaanennadu Nenu Anaathanu
0
views
పల్లవి
కానెన్నడు నేను అనాథను అయ్య కానెన్నడు నేను అనాథను (2) (నా) కన్నీరు తుడచువాడా నేనున్నానని అనువాడా (2) ||కానెన్నడు||
1వ చరణం
అమ్మ నాన్న దూరమైనా బంధువులే వెలివేసినా (2) నా అమ్మ నాన్న నీవే యేసయ్యా నా తోడు నీడ నీవే యేసయ్య (2) ||కానెన్నడు||
2వ చరణం
వెక్కి వెక్కి ఏడుపొచ్చినా వెక్కిరింతల పాలైనా (2) నా కన్నీరు తుడచువాడా నేనున్నానని అనువాడా (2) ||కానెన్నడు||
3వ చరణం
వ్యాధి బాధలవరించినా రోగములతో కృంగదీసినా (2) నా వైద్యుడవు నీవే యేసయ్యా నన్ను స్వస్థపరచువాడవు నీవే (2) ||కానెన్నడు||