TG-3521
Telugu

కానరావే అలనాటి కన్నీటి

Kaanaraave Alanaati Kanneeti

0
views
పల్లవి

కానరావే అలనాటి కన్నీటి ప్రార్ధనలు కదలవేమి అపవాది చెరసాల పునాదులు ఇది నీ లోపమా – మరి నా లోపమా యోచించుమా క్రీస్తు సంఘమా (2) యోచించుమా క్రీస్తు సంఘమా ||కానరావే||

1వ చరణం

సమూయేలుల నందించే హన్నాలేరి సమర్పణతో ప్రార్ధించే ఎస్తేరులేరి (2) నీతి కొరకు నిలబడే స్తెపనుల జాడేది (2) నిండు మనస్సుతో ఆరాధించే కాలేబులెటు పోయిరో కాలేబులెటు పోయిరో ||ఇది నీ లోపమా||

2వ చరణం

అపొస్తలుల ఆదరించే బర్నబాలేరి ఆత్మలకై పరుగెత్తే ఫిలిప్పులేరి (2) శ్రమలకే ఎదురు నిలచే పౌలు వారసులేరి (2) శత్రువుతో పోరాడి గెలిచే దావీదులెటు పోయిరో దావీదులెటు పోయిరో ||ఇది నీ లోపమా||

3వ చరణం

నిద్ర లేవాలి ఓ సంఘమా అసత్యాన్ని ఖండించే సత్య స్థంభమా క్రీస్తుకై కదలాలి ఓ సంఘమా ఉజ్జీవం నీలో నిండాలి ఓ సంఘమా… నిజ సంఘమా Kadalavemi Apavaadi Chersaala Punaadhulu Idi Nee Lopamaa – Mari Naa Lopamaa Yochinchumaa Kreesthu Sanghamaa (2) Yochinchumaa Kreesthu Sanghamaa ||Kaanaraave||