♪♫
TG-3525
Telugu
కావలివాడా ఓ కావలివాడా
Kaavalivaadaa O Kaavalivaadaa
0
views
పల్లవి
కావలివాడా ఓ కావలివాడా కనులు తెరచి పొలమును చూడు కోతకు వచ్చిన పంటను కోయుము ||కావలి||
1వ చరణం
పిలిచెను నీ యజమానుడు జత పనివాడవై యుండుటకు (2) కొలుచును నీ ఫలమంతమున పని చేసిన రీతిగనే (2) ||కావలి||
2వ చరణం
నమ్మెను నీ యజమానుడు అప్పగించెను తన స్వాస్థ్యము (2) తిరిగి వచ్చును జీతమియ్యను సిద్ధ పడుము ఇక నిద్ర మాని (2) ||కావలి||
3వ చరణం
ఎంచెను నీ యజమానుడు నీ పాదములు సుందరములని (2) ఉంచెను కర్మెలు పర్వతముపై పరుగిడుము పరాక్రమ శాలివై (2) ||కావలి||
4వ చరణం
వేయుము పునాది నేర్పరివై చెక్కుము రాళ్లను శిల్ప కారివై (2) కొయ్య కాలును కర్ర గడ్డియు కాలిపోవును అగ్ని పరీక్షలో (2) ||కావలి||