TG-3526
Telugu

కదలకుందువు సీయోను

Kadalakunduvu Seeyonu

23
views
పల్లవి

కదలకుందువు సీయోను కొండవలె బెదరకుందువు బలమైన సింహం వలె (2) యేసయ్య నీ చెంత ఉండగా ఏ చింత నీకింక లేదుగా (2) కష్టములెన్నో కలుగుచున్ననూ నిట్టూర్పులెన్నో వచ్చియున్ననూ దుష్ట జనములుపై దుమికి తరిమిన భ్రష్ట మనుష్యులు నీ మీదికి వచ్చినా ||కదలకుందువు||

1వ చరణం

నీటి వరదలు నిలువెత్తున వచ్చినా నిండు సముద్రము నీళ్లు ఉప్పొంగి పొరలినా ఆకాశము నుండి పై అగ్ని కురసినన్ ఏనాడు ఏ కష్టం నష్టం నీకుండదు ||కదలకుందువు||

2వ చరణం

నీరు కట్టిన తోటవలెను నిత్యం ఉబుకుచుండు నీటి ఊటవలెను నీటి కాల్వల యోరను నాటబడినదై వర్ధిల్లు వృక్షం వలె నిక్షేపముగా నీవుందువ్ ||కదలకుందువు||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.