♪♫
TG-3524
Telugu
కావలెనా యేసయ్య
Kaavalenaa Yesayya
0
views
పల్లవి
కావలెనా యేసయ్య బహుమానము (మరి) చేయాలి విలువైన ఉపవాసము (2) సిద్ధమౌ శ్రీ యేసుని ప్రియా సంఘమా చిగురించాలి అంజూరపు చెట్టు కొమ్మలా (2) ||కావలెనా||
1వ చరణం
నీనెవె పట్టణము యెహోవా దృష్టికి ఘోరమాయెను – పాపముతో నిండిపోయెను సృష్టికర్త యెహోవా యోనాను దర్శించి నీనెవెకు పంపెను – కనికరము చూపించెను ఘనులేమి అల్పులేమి – నీనెవె పట్టణపు రాజేమి పిల్లలేమి పెద్దలేమి – ఉపవాసము చేయగా ఆగింది యెహోవా శాపము కురిసింది కరుణ వర్షము (2) ||కావలెనా||
2వ చరణం
దేవుని ప్రజలను నశియింప చేయుటకు దుష్టుడు తలచెను – కలవరము పుట్టించెను మొర్దెకై వేదనతో రాజునొద్దకు పంపుట దైవ చిత్తమని – ఎస్తేరును సిద్ధపరచెను ఘనులేమి అల్పులేమి – షూషను కోటలో రాణి ఏమి పిల్లలేమి పెద్దలేమి – ఉపవాసము చేయగా అణిగింది హామాను గర్వము జరిగింది దేవుని చిత్తము (2) ||కావలెనా||