చీకటి కాలము వచ్చుచుండె - కృపకాలము నుపయోగించు
cheekati kaalamu vachchuchunde - krupakaalamu nupayooginchu
చీకటి కాలము వచ్చుచుండె - కృపకాలము నుపయోగించు తలుపులు తెరచి యుండగనే విరిగిన మనస్సుతో సాగెదవా పల్లవి: తలుపులు తెరచి యుండగనే విరిగిన మనస్సుతో సాగెదవా కాలమపాయముగా నుండే సమయము సద్వినియోగించు ||చీకటి కాలము||
బీడు భూములధికముగా - చూసిన నీవు సాగిరా యేసుని వారికి చూపించు - ప్రేమా వార్తను చాటించు ||తలుపులు||
ఎన్నో రాజ్యములీనాడు - దేవుని పనికి మూయబడె తెరచిన తలుపులు యెదురుండున్- ప్రవేశింతురు జ్ఞానులు ||తలుపులు||
విశ్వాసుల సహవాసమున - ప్రేమా ఐక్యత గలదు అని చెప్పెడి దినములు - మన మధ్యకు రావలెను ||తలుపులు||
రానైయున్న బాధ్యతలు - మనకధికము ప్రియులారా మనకు జయము గలుగుటకై - వినయమున పోరాడెదము ||తలుపులు||
మాదు హృదయముల నింపు - నీదు ప్రేమతో మా ప్రభువా హిందూ దేశపు వీధులలో - నాధా నిన్నే చాటెదము ||తలుపులు||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.