చీకటి లోయలో నేను పడియుండగా
cheekati looyaloo neenu padiyundagaa
చీకటి లోయలో నేను పడియుండగా నీవే దిగి వచ్చి నను కనుగొంటివి మరణపు గడియలో నేను చేరియుండగా నీ రక్తమిచ్చి నను బ్రతికించితివి నీవే.. దేవా నేవే.. నీవే నీవే నా ప్రాణ దాతవు నీవే ప్రభు చేర్చు.. దేవా చేర్చు.. నన్ను చేర్చు ఎత్తైన కొండ పైకి నను చేర్చు ప్రభు అరణ్యములలో నేను పయనించినను ఏ అపాయమునకిక భయపడను నీవే నా మార్గమని నిను వెంబడించెదను నా చేయి పట్టి నను నడిపించుము నీకే.. దేవా నీకే.. నీకే నీకే నా సమస్తము నీకే అర్పింతును నా తండ్రి ఇంటికి నను చేర్చు ప్రభు ఆకలి దప్పులు లేని.. శ్రమలు అలసటలు లేని శోధన ఆవేదన లేని.. భయము దుఃఖము లేని మరణం కన్నీరు లేని.. చీకటి ప్రవేశం లేని సకల సమృద్ధి ఉండు.. దూతల స్తుతిగానాలుండు భక్తుల సమూహముండు.. మహిమ ప్రవాహముండు నిత్యం ఆరాధన ఉండు.. నిరతం ఆనందముండు
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.