TG-4958
Telugu

చీకటిలో నాకు వెలుగాయెను తన మార్గములో నన్ను నడిపించెను

Cheekatiloo Naaku Velugaayenu Thana Maargamuloo Nannu Nadipinchenu

16
views
పల్లవి

చీకటిలో నాకు వెలుగాయెను తన మార్గములో నన్ను నడిపించెను (2) అంధకార శక్తులే నన్నావరించగా పాపములో శాపములో నేనుండగా నను రక్షించే దేవుడే నా కోసం వచ్చెను తన రక్తముతో నా స్థితిని సరిచేసేను యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు మహోన్నతుని చాటున నే నివసించు వాడను సర్వ శక్తిమంతుడే నా తోడైయుండగా భయము లేదు దిగులు లేదు నా సహోదరా (2) ఎర్ర సముద్రం నా ముందున్నను నా శత్రువులే నను వెంబడించగా క్రుంగదీసే పరిస్థితుల్ ఎదురైనను జడియను నేను నాకు భయమే లేదు పిరికితనం కలిగిన ఆత్మను నాకివ్వలేదు ధైర్యంతో ఉండమని సెలవిచావు నా భారమంతా మోసి నీ రెక్కలతో కప్పి నా తోడు నీవై నను హత్తుకున్నావూ ||యెహోవా||

1వ చరణం

నిస్సహాయతే నన్ను క్రుంగదీసిన వెను తిరుగను నేను జీవితాంతము పక్షపాతామే లేని దేవుడాయనే నేనే స్థితిలో ఉన్నా కానీ నన్నువిడువడు ఈ భూమిని నిర్మించిన గొప్ప వాడు నా యేసు లోకమును ఎంతగానో ప్రేమించెను సృష్టికర్తనే మరిచి సృష్టిని పూజించుట ఎంత మాత్రము తగదు నా సహోదరా ||యెహోవా||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.