TG-3201
Telugu

చీకటులే నన్ను కమ్ముకొనంగా

Cheekatule Nannu Kammukonangaa

0
views
పల్లవి

చీకటులే నన్ను కమ్ముకొనంగా దుఃఖంబు నాకాహారంబు కాగా ఏకాకినై లోకంబులోన కనిపెట్టుకొనియుందు నీ రాక కొరకు – (2) మేఘములు నన్ను ముసుగుకొనంగా ఉరుములు నాపై దొరలుచుండంగా వడగండ్ల వాన కురియుచుండంగా కనిపెట్టుకొనియుందు నీ రాక కొరకు – (2) అన్యాయ క్రియలు అధికంబు కాగా మోసంబులే నాకు వ్యసనంబు కలుగ ఆకాశ శక్తులు కదలించబడగా కనిపెట్టుకొనియుందు నీ రాక కొరకు – (2) త్వరలోనే రమ్ము పరలోక వరుడా వరమేని తనయా ఓ గొర్రెపిల్లా (2) కడబూర మ్రోగన్ తడవేల ప్రభువా (2) కనిపెట్టుకొనియుందు నీ రాక కొరకు – (2) ||చీకటులే||