TG-280
Telugu

చేరి భుజియింపుడీవిందు యేసు సిద్ధపరచిన

cheeri bhujiyinpudeevindu yeesu siddhaparachina

199
views
పల్లవి

చేరి భుజియింపుడీవిందు యేసు సిద్ధపరచిన కృపావిందు తోరణంబగు మేడ గదిలో జేరి శిష్యుల తోడ సిలువ భారమున్ మదినెంచి నెరపిన భావ గర్భితమైన విందు ||చేరి భుజియింపుడీవిందు||

1వ చరణం

జీవాహారము దైవసుతుడే పరమ జీవజలముల దాత యితడే జీవనాధుని రక్త మేనులు జీవానాహారములు కాగా చావును దొల గించి మృతులస జీవులనుగా మార్చువిందు ||చేరి భుజియింపుడీవిందు||

2వ చరణం

కారుణ్యనిధి యేసు రాజు నరుల గావగ బలియైన రోజు భారమైన సిలువ కెరయై పాప భారము పరిహరింప ధారవోసిన పుణ్యరక్తపు ధారలన్ దలపోయు విందు ||చేరి భుజియింపుడీవిందు||

3వ చరణం

దాసగణముల బ్రోవనెంచి రుధిర ధారలను గార్చిభరించి భాసు రంబగు నవ నిబంధన జేసి సంఘ పునాది వేసి వాసి మీరగ నిత్య జీవము బోసినట్టి యేసు విందు ||చేరి భుజియింపుడీవిందు||

4వ చరణం

పాప పరిహారార్థముకై క్రీస్తు పడిన ఘోరబాధ కొరకై యేపు దనరగ స్తుతులుబాడుచు యేసునాధుని రాకవరకు ఆపకుండగ సత్ప్రసాదము నందుకొని బలమొంద రండి ||చేరి భుజియింపుడీవిందు||

5వ చరణం

విందుతో మొదలిడిన సేవ యేసు విందుతో ముగియించె బ్రోవ విందులోగల మర్మమేదియొ విపులముగ బోధించు క్రీస్తున్ డెందమున ధ్యానించి యాయన యందె నమ్మిక గలిగియుందము ||చేరి భుజియింపుడీవిందు||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.